ప్రత్యూష బెనర్జీ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ సినిమా.. హీరోయిన్ కంగనా!
బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ అంటే ఒకప్పుడు ఎవరికి అంతగా తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్న తరువాత ఆమె అంటే తెలియని వారుండరు. ''చిన్నారి పెళ్ళికూతురు''లో ఆనంది అంటే మాత్రం వెంటనే గుర్తొస్తుంది. చిన్నప్పటి అనంది ఎపిసోడ్ అయ్యాక వచ్చిన యువ పెళ్ళికూతురు పాత్రలో నటించిన ప్రత్యూష బెనర్జీ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
ఇటీవల ఆమె ముంబైలో ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ సీరియల్ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. జార్ఖండ్‌లో పుట్టి, హీరోయిన్ అవ్వాలని ముంబైకి వచ్చిన ప్రత్యూష జీవితం ఇలాఅర్ధంతరంగా ముగిసిపోవడంతో సినీప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదిలావుంటే ఈ చిన్నారి ప్రత్యూష బెనర్జీ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట.
అతనెవరో కాదు బాలికవధువుకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రచయితే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట. బాలీవుడ్ ఇప్పటికే ఎంతోమంది నిజజీవితాలను ఆధారంగా చేసుకుని సినిమాలుగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యూష బెనర్జీ కథను కూడా సినిమాగా తీయాలని దర్శకుడు భావిస్తున్నారట. ప్రత్యూష పాత్రలో కంగనా రనౌత్‌తో చేయించాలని దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడట. మరి ఈ విషయంపై కంగనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.