బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (12:28 IST)

"ప్రేమలు" ఫేమ్ మమితా బైజు డ్యాన్స్ అదుర్స్

Mamitha Baiju
Mamitha Baiju
బ్లాక్‌బస్టర్ మలయాళ రొమాంటిక్ కామెడీ "ప్రేమలు" ఫేమ్‌కు చెందిన మలయాళ యువ నటి మమితా బైజు డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మమిత స్మైల్, డ్యాన్స్ మూమెంట్స్‌కు సినీ జనం ఫిదా అవుతున్నారు. 
 
తాజాగా ఓ ఈవెంట్‌లో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పసుపు-ఆకుపచ్చ చీర ధరించి, మమిత పెప్పీ పాటకు సూపర్‌గా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది. 
 
ఇకపోతే.. ప్రేమలు సినిమా ఫిబ్రవరి 9న రిలీజైంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.110 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో మమిత రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారిపోయింది. ప్రేమలు తెలుగు వెర్షన్ గత వారం విడుదలైంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ అయ్యింది.