సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 మార్చి 2024 (19:04 IST)

శేఖర్ కమ్ముల.. కుబేర కొత్త షెడ్యూల్ బ్యాంకాక్‌లో ప్రారంభం

Shekhar Kammula,  Nagarjuna
Shekhar Kammula, Nagarjuna
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్యంలో రూపొందుతున్న 'కుబేర చిత్రం ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ధనుష్ డిఫరెంట్ అవతార్ అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
తాజాగా టీమ్ బ్యాంకాక్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో నాగార్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు.
 
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైనర్లు.
 
తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు