ఇంటలిజెన్స్ అధికారిగా మహేష్ బాబు: త్వరలో సెట్స్‌పైకి మురుగదాస్ ఫిలిమ్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమా పనుల్లో మునిగిపోయారు. శ్రీమంతుడు హిట్.. బ్రహ్మోత్సవం ఫట్ కావడంతో కాస్త డీలా పడిన ప్రిన్స్.. తిరిగి కోలుకుని తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. కత్తి ఫేమ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఇంటలిజెన్స్ అధికారిగా కనిపిస్తున్నాడని తెలిసింది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
త్వరలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నటీనటుల ఎంపిక కూడా దాదాపుగా ఖరారైపోయిందని యూనిట్ వర్గాల సమాచారం. ఇక స్మార్ట్ హీరో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ సుందరి పరిణీతి చోప్రో నటిస్తోంది. ‘గజని, తుపాకి’ వంటి సినిమాలకు ఆర్ట్ డైరక్టర్‌గా పనిచేసిన సునీల్, ఫేమస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హారిశ్ జయరాజ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. హారిశ్ జయరాజ్ సంగీతం సమకూర్చుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసే సెట్‌లో సినిమా ప్రారంభం కానుందని తెలిసింది.