మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 18 ఆగస్టు 2018 (22:23 IST)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నిశ్చితార్థం(ఫోటోలు)

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రియుడినే పెళ్లాడనుంది. ప్రియుడితో నిశ్చితార్థం జరిగిన ఫోటోలను తన ఫేస్ బుక్కులో షేర్ చేసింది. ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్ నిశ్చితార్థం శనివారం జరిగింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ శనివార

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రియుడినే పెళ్లాడనుంది. ప్రియుడితో నిశ్చితార్థం జరిగిన ఫోటోలను తన ఫేస్ బుక్కులో షేర్ చేసింది. ప్రియాంక చోప్రా, నిక్‌జోనస్ నిశ్చితార్థం శనివారం జరిగింది. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌, ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ శనివారం ముంబైలో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ప్రియాంకను నిక్ ముద్దాడుతుండటం.. వారి వెనుక ఎన్పీ అనే ఆంగ్ల అక్షరాల డేకరేషన్‌తో ఉన్న ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. వీరి ఎంగేజ్‌మెంట్ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. 
 
జూన్‌లో భారత్ వచ్చిన నిక్.. ప్రియాంక తల్లితో మాట్లాడి.. ప్రియాంకను పెళ్లి చేసుకునేందుకు ఒప్పించినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించడంతో ముందుగా నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటిస్తారని సమాచారం.