మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (13:02 IST)

చార్మీ 50 యేళ్ల మహిళ అయితే మా గురించి అలా ఆలోచించరు... పూరీ

Puri Birthday celebrations
గత కొద్ది రోజులుగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు, హీరోయిన్ చార్మీలు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ వారు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా "లైగర్" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తనకు చార్మీకి మధ్య ఉన్న రిలేషన్‌పై పూరీ జగన్నాథ్ ఓ క్లారిటీ ఇచ్చారు. 
 
"చార్మీ 50 ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ,+ ఆమె (ఛార్మి) యంగ్‌ ఏజ్‌లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జనమంతా అనుకుంటున్నారు. 
 
నిజానికి ప్రతి జంటకూ ఓ రొమాంటిక్‌ యాంగిల్‌, శృంగార ఆకర్షణ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది కూడా. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. 
 
కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఈ అమ్మాయి(ఛార్మి) 13 ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు" అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్‌ గురించి పూరీ జగన్నాథ్‌ ఆసక్తికరంగా జవాబిచ్చారు.