మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (12:10 IST)

విజయ్ దేవరకొండ లాంటి హీరోను చూడలేదు : పూరీ జగన్నాథ్

Puri- Vijay
విజయ్ దేవరకొండ వంటి హీరోను తాను ఇంతవరకు తాను చూడలేదని, లైగర్ చిత్రం తర్వాత ఆయన మరో స్థాయికి చేరుకుంటాడని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో "లైగర్" చిత్రం తెరకెక్కింది. ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పూరీ జగన్నాథ్ పాల్గొని ప్రసంగించారు. 
 
"అర్జున్ రెడ్డి సినిమా చూసినపుడే విజయ్‌తో ఓ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ సినిమాల్లోనే కాదు బయటకూడా అంతే నిజాయితీగా ఉంటాడు. తనలో నేను ఇష్టపడేది అదే. నిర్మాతగా నేను ఒక రోజున రూ.2 కోట్లు పంపించాను. మాకు వేరే చోట అప్పు ఉందని తెలిసిన తను ముందుగా ఆ అప్పు తీర్చమని ఆ డబ్బు వెనక్కి పంపించారు. 
 
ఈ రోజుల్లో కూడా ఇలాంటివారు ఉంటారా చెప్పండి. ఒక నిర్మాత కష్టాల్లో ఉన్నపుడు అండగా నిలబడేవాళ్లు ఎవరు? విజయ్ లాంటి హీరోను నేను ఇంతవరకు చూడలేదు. నా కష్టాలు తనవిగా భావించి అండగా నిలిచారు. ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నాను అని అన్నారు.