గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 28 అక్టోబరు 2020 (11:46 IST)

పూరి.. బాలయ్యతో సినిమా నిజమేనా..? కాదా..?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఫైటర్. సన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కిస్తోన్న ఈ ఫైటర్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. లాక్ డౌన్ టైమ్‌లో పూరి మూడు కథలు రెడీ చేసాడని.. వీటితో ఓ కథ బాలయ్య కోసమని తెలిసింది. అంతేకాకుండా బాలయ్య తదుపరి చిత్రాన్ని బాలయ్యతోనే తీయనున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి.
 
మరోవైపు చిరు కోసం కథ రెడీ చేసాడని.. అలాగే నాగ్ కోసం కూడా కథ రెడీ చేసాడని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా పూరి బాలయ్య సినిమా ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం ఊపందుకుంది. బోయపాటితో బాలయ్య చేస్తున్న సినిమా తర్వాత పూరితోనే సినిమా ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అయితే.. పూరి మాత్రం ప్రజెంట్ ఫైటర్ మూవీ గురించే ఆలోచిస్తున్నాడట. 
 
సాధ్యమైనంత త్వరగా ఫైటర్ మూవీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాతే తదుపరి చిత్రం ఎవరితో అనేది ఆలోచిస్తానని పూరి సన్నిహితులతో చెప్పారని తెలిసింది. హైదరాబాద్‌లో ఫైటర్ తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే బ్యాంకాక్‌లో కూడా మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య, పూరి సినిమా నిజమేనా కాదా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.