"రారండోయ్ వేడుక చూద్దాం" టైటిల్ సాంగ్ రిలీజ్.. వీడియో చూడండి
"రారండోయ్ వేడుక చూద్దాం" అంటున్నాడు నాగచైతన్య. సమంతను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న చైతూ.. పెళ్లికి ముందుగా వేడుక చూద్దాం రమ్మని పిలుస్తున్నాడా.. అన్నట్లుంది ఈ సినిమా టైటిల్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినే
'రారండోయ్ వేడుక చూద్దాం' అంటున్నాడు నాగచైతన్య. సమంతను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న చైతూ.. పెళ్లికి ముందుగా వేడుక చూద్దాం రమ్మని పిలుస్తున్నాడా.. అన్నట్లుంది ఈ సినిమా టైటిల్. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా పోస్టర్ ఉగాదికి రిలీజైన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు చెందిన టైటిల్ సాంగ్‌ను శనివారం (మే 5) రిలీజ్ చేశారు. అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది.
"బుగ్గన చుక్క పెట్టుకుంది సీతమ్మ కంటి నిండ ఆశలతో... రారండోయ్ వేడుక చూద్దాం" అంటూ సాగుతున్న ఈ సినిమా పాట అభిమానులకు తెగ నచ్చేస్తుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాటను అనేక మంది వీక్షించారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.