శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (02:27 IST)

నేనంటే నా జీన్స్ సైజ్ కాదంటున్న రాశిఖన్నా: ఆ వీడియో వైరల్

సినిమా తారలు చూపుల గొడ్లు అంటూ అలనాటి ప్రముఖ చిత్ర దర్శకుడు చక్రపాణి ఒక సందర్భంలో అన్నారు. అంటే చూపులకు, గ్లామర్ తళుకుబెళుకులకు తప్ప వీరెందుకూ పనికి రారు అనే ఆర్థంలో ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. కాని నవతరం తారలు తాము గ్లామర్ బొమ్మలం కాదని తమకూ స్వే

సినిమా తారలు చూపుల గొడ్లు అంటూ అలనాటి ప్రముఖ చిత్ర దర్శకుడు చక్రపాణి ఒక సందర్భంలో అన్నారు.  అంటే చూపులకు, గ్లామర్ తళుకుబెళుకులకు తప్ప వీరెందుకూ పనికి రారు అనే ఆర్థంలో ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. కాని నవతరం తారలు తాము గ్లామర్ బొమ్మలం కాదని తమకూ స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి తగిన విలువలు ఉంటాయని, వాటినిక దాచుకోమని ప్రకటించడమే కాదు. అమల్లో పెట్టేస్తున్నారు కూడా. అదెంత స్థాయిలో చూసేవారి మతులు పోయే స్థాయిలో. అందం వెనుక ఇంత వ్యక్తిత్వ ప్రదర్శన కూడా ఉంటుందా అనేంత స్థాయిలో వారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందాల బొమ్మ రాశి ఖన్నా కూడా ఇప్పుడా కోవలో చేరిపోయింది.

 
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ అరుదైన వీడియోతో మన ముందుకు రానుంది. తనకు దక్కిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్న రాశీకన్నా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన ఈ ముద్దుగుమ్మ తన సొంత ప్రొడక్షన్‌లో స్పెషల్ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'బిలీవ్‌ ఇన్‌ యూ' అంటూ ఓ వీడియోను మన ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో బిలీవ్ ఇన్ యూ అనే హ్యాష్ ట్యాగ్‌తో మేకింగ్‌ వీడియోను శనివారం తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ మేకింగ్ వీడియోను అందరికీ షేర్ చేయాలని రాశీఖన్నా కోరింది. మహిళా దినోత్సవం రోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలని భావించి ఆమె ఈ ప్రయత్నం చేయనుంది. ఎవరిని వారు పూర్తిగా నమ్ముకోవాలని దాంతో అద్భుతాలు చేయవచ్చునని చెప్పడమే విడుదల కాబోయే వీడియో సారాంశమని తెలుస్తోంది.
 
సొంతంగా రాసిన ఓ పద్యాన్ని కూడా పోస్ట్ చేసింది. నేనంటే ధైర్యం, నేనంటే అగ్ని, నేనంటే మీరు కోరుకున్నట్లుగా ఉండటం కాదు.. నాకు నచ్చినట్లుగా ఉండటం' అంటూ ఇంగ్లీష్ పద్యంలో రాసుకొచ్చింది మిల్కీ బ్యూటీ రాశీఖన్నా.
 
 
టాగ్లు raashi khanna, International Women's day, believe in you, రాశీఖన్నా, బిలీవ్ ఇన్ యూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం