ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 జూన్ 2017 (11:40 IST)

బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారు కొన్న రాజమౌళి... ధర రూ.కోటిన్నర

"బాహుబలి" చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్తకారుకు యజమాని అయ్యారు. అదీ కూడా బెంజ్ కారు. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ పేరుతో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర రూ.కోటిన

"బాహుబలి" చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్తకారుకు యజమాని అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ పేరుతో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారును ఆయన సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర రూ.కోటిన్నర. 
 
బాహుబలి చిత్రంతో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయిన రాజమౌళి.. నిజజీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారు. ఇప్పటివరకు ఆయన తన కజిన్స్‌తో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్నారు. ఆయన ప్రయాణించే కారు కూడా సాదాసీదాగానే ఉంటుంది. ఒక్కోసారి క్యాబ్‌లో కూడా షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లిపోతుంటారు జక్కన్న. 
 
అయితే ఇప్పుడు రాజమౌళి ఓ ఖరీదైన కారుకు యజమాని అయ్యారు. దాదాపు కోటిన్నర ఖర్చు చేసి బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును కొనుగోలు చేశారు. 'బాహుబలి' లాభాల్లో వాటా తీసుకున్న రాజమౌళికి చాలా భారీగా పారితోషికం దక్కింది.