బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (18:05 IST)

పుట్టిన‌రోజు నాడు భావోద్వేకానికి గుర‌యిన రాజ‌శేఖ‌ర్‌

Dr. Rajasekhar, Jeevita Rajasekhar
డాక్టర్ రాజశేఖర్ తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు. ఇతని మొదటి చిత్రం వందేమాతరం. ఎగ్రెసివ్ కేరెక్ట‌ర్ల‌కు పెట్టింది పేరు. పోలీసు పాత్ర‌ల‌కు ఆయ‌న బాగా సూట‌వుతారు. జీవిత ఆయ‌న జీవితంలో ప్ర‌వేశించాక ఆయ‌న కెరీర్ ఆమెనే చూసుకుంటుంది. నేడు రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని అనాథ‌శ్రామాల‌కు వెళ్లి పండ్లు, భోజ‌నాలు అంద‌జేశారు. అలాగే బ‌స‌వ తార‌కం కేన్స‌ర్ ఆసుప్ర‌తిలో పేషెంట్ల‌కు భోజ‌న ఏర్పాట్లు చేసి వారితో కొద్దిసేపు గ‌డిపారు.
 
Anoop rubens wishes Rajasekhar,
ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న సన్నిహితులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో కేక్‌ను క‌ట్ చేశారు. అనంత‌రం మాట్లాడుతూ, ఇటీవ‌లే నాకు క‌రోనా సోకింది. ఇక నేను బ‌త‌క‌ను అనుకున్నా. శ్వాస‌లో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నా. ఆ స‌మ‌యంలో మీ ప్రార్థ‌నాలు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదం వ‌ల్లే నేను బ‌తికి వున్నానంటూ భావోద్వేకానికి లోన‌య్యారు. ఆయ‌న తాజా సినిమా `శేఖ‌ర్‌`. ఇది ఈనెల 25న విడుద‌ల కాబోతుంది. ఈ చిత్రంలో కొత్త‌గా క‌నిపిస్తాను. అనూప్ మంచి బాణీలు ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఇక‌ జీవితా ద‌ర్శ‌క‌త్వం అద్భుత‌గా చేసింది అన్నారు.