Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు
Updated: Sat, 2 May 2026 (19:58 IST)
Satee leelavati trailer poster
'సతీ లీలావతి' చిత్రంలో చురుకైన లీలావతిగా లావణ్య త్రిపాఠి కొణిదెల, ఆమె విలక్షణమైన భర్త రామ్ సేతుగా దేవ్ మోహన్ నటించారు. ఈ చిత్రం వారి మధ్య సరదా సంభాషణలు, గొడవలు, మరియు కుటుంబ గందరగోళం ద్వారా ఆధునిక వైవాహిక జీవితాన్ని చిత్రీకరిస్తుంది. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వి.కె. నరేష్ హాస్య పాత్రలు పోషించారు. వరుణ్ తేజ్ ప్రశంసలతో పాటు కొణిదెల కుటుంబం మద్దతుతో ఈ చిత్రం మే 8న థియేటర్లలోకి రానుంది. అద్భుతమైన విజువల్స్, మిక్కీ జె. మేయర్ సంగీతం, మరియు లావణ్య యొక్క మహిళా ప్రాధాన్య ప్రధాన పాత్రతో, ఇది మనకు బాగా కనెక్ట్ అయ్యే నవ్వులతో నిండిన ఒక ఫీల్-గుడ్ సమ్మర్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని వాగ్దానం చేస్తోంది.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. సతీ లీలావతి కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. సతీ లీలావతి అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి అని అన్నారు.
దేవ్ మోహన్ మాట్లాడుతూ .. మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.
తాతినేని సత్య మాట్లాడుతూ .. మా సతీ లీలావతి ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.