శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (20:15 IST)

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ram charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ప్రఖ్యాత మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో చెర్రీ మైనపు బొమ్మను ప్రతిష్టించనున్నారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్‍‌లో ప్రముఖుల మైనపు బొమ్మలు ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా టుస్సాడ్ ప్రతినిధులు రామ్ చరణ్ కొలతలు తీసుకున్నారు. చెర్రీ మైనపు బొమ్మను 2025 వేసవి నాటికి అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సినిమా రంగానికి చెర్రీ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అరుదైన గౌరవం కల్పించనున్నారు. 
 
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తనకు స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తు్న్నానని రామ్ చరణ్ పేర్కొన్నారు. తాను చిన్న వయసులో ఉన్నపుడు దిగ్గజ వ్యక్తులను అక్కడ చూసి ఆనందించేవాడినని, కానీ, ఏదో రోజున అలాంటి వారి మధ్య తాను ఉంటానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు అన్నారు. ఇలాంటి అద్భుతమైన అవకాశం దక్కించుకున్నందుకు తాను మ్యూజియం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.