గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (15:01 IST)

క్లిన్ కారా మొదటి పుట్టిన రోజు.. వీడియో, ఫోటో అదుర్స్

Klin Kaara
Klin Kaara
రామ్ చరణ్- ఉపాసన కామినేని కొణిదెల తమ కుమార్తె క్లిన్ కారా మొదటి పుట్టినరోజు జరుపుకుంది. తాజాగా ఉపాసన పంచుకున్న కొత్త వీడియోలో, రామ్ చరణ్ పిల్లల కోసం 11 ఏళ్లు నీరిక్షంచాల్సి వచ్చిందని  పేర్కొంది. ఈ 11 సంవత్సరాల నిరీక్షణలో కుటుంబం, స్నేహితుల నుండి వారు ఎదుర్కొన్న ఒత్తిడి గురించి చెప్పుకొచ్చింది. 
 
జూన్ 14న రామ్ చరణ్ మరియు ఉపాసన కామినేని 12 సంవత్సరాల వైవాహిక ఆనందాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రత్యేక సందర్భంలో ఈ జంట తమ కుమార్తె క్లిన్ కారాతో కలిసి నడుస్తూ కనిపించారు. ఈ పిక్చర్-పర్ఫెక్ట్ స్నాప్‌గా నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. 
 
రామ్ చరణ్ లేత గోధుమరంగు ప్యాంటుతో కూడిన ఆఫ్-వైట్ షర్ట్ ధరించి కనిపిస్తాడు. మరోవైపు, ఉపాసన నీలిరంగు దుస్తులతోనూ క్లిన్ కారా వారిద్దరి చేతుల్ని పట్టుకుని నడుస్తుంది.  
 
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌కు క్యాప్షన్ ఇస్తూ, ఉపాసన కామినేని ఇలా రాశారు.. "12 సంవత్సరాల పాటు కలిసి ఉన్నందుకు మాకు వచ్చిన గిఫ్ట్. ప్రేమ శుభాకాంక్షలకు అందరికీ ధన్యవాదాలు. మా జీవితాలను నిజంగా అద్భుతంగా మార్చడంలో మీలో ప్రతి ఒక్కరు ప్రత్యేక పాత్ర పోషించారు. చాలా కృతజ్ఞతలు" అంటూ చెప్పుకొచ్చింది.