శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 8 జూన్ 2024 (12:01 IST)

గేమ్ ఛేంజర్ సెట్లో రామోజీ రావు కి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్, శంకర్

tributes to Ramoji Rao  Game Changer set
tributes to Ramoji Rao Game Changer set
పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్... రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకులు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు.
 
రామోజీ రావు గారి మరణం తెలుగు సినీపరిశ్రమకు తిరనిలోటని ఈనాడు గ్రూప్‌కు చైర్మన్ గా వారు తెలుగు భాష పట్ల చూపించి ప్రేమ ఎన్నటికీ మరువరని దాని ,నిర్మాత గా60కి పైగా సినిమాలను నిర్మించి ఎన్ని అవార్డు లను పొందినరని, రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి భారతదేశంలోనే ఒక అగ్రగామిగా నిలిచారాని అన్నారు,దక్షిణాది చలనచిత్ర షూటింగ్ లతో ఆ స్టూడియో ఎప్పుడు బిజీ గా ఉంటుందని ,అలా ఎందరో కార్మికుల కు ఆ స్టూడియో ద్వారా పని కల్పించారని ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని  ట్విట్టర్ లో రామ్ చరణ్ పేర్కొన్నారు.