సంబంధిత వార్తలు
- ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు
- PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్
- పెద్ది బాడీగార్డ్ గురించి తెలుసా? భారీ పారితోషికం... చక్కటి ఫ్యాషన్ సెన్స్
- 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు
కలెక్షన్ నంబర్లలో ఒక చిత్ర విజయాన్ని నిర్ణయించలేం : రామ్ చరణ్
ఒక చిత్ర సక్సెస్‌ను బాక్సాఫీస్ కలెక్షన్ నంబర్లతో నిర్ణయించలేమని హీరో రామ్ చరణ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం పెద్ది. జూన్ 4వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒక చిత్రానికి కలెక్షన్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే ఆ చిత్ర విజయాన్ని నిర్ణయించలేమని పేర్కొన్నారు.
'మంచి బాక్సాఫీస్ నంబర్లు మన తదుపరి సినిమాలను కూడా నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే రాబోయే చిత్రాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే.. అలా అని కేవలం అవి ఒక్కటే విజయానికి కొలమానం కాదు' అని రామ్ చరణ్ అన్నారు.
మరోవైపు, జూన్ 4న విడుదల కానున్న 'పెద్ది' సినిమాకు ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాగా ఓవర్సీస్‌లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి)గా నిర్ణయించింది.
అలాగే సినిమా విడుదలయ్యే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు.
