మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (16:11 IST)

ఉపాస‌న హెయిర్ స్ప్రేను స్ప్రే చేసే క్యూట్ మూమెంట్‌ తో రామ్‌చ‌ర‌ణ్‌

Ramcharan with  Upasana hair spray
Ramcharan with Upasana hair spray
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. కోట్లాది మంది అభిమానులున్న అగ్ర క‌థానాయ‌కుడు. రీసెంట్‌గా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఆస్కార్ అవార్డ్స్ సంద‌ర్భంగా వానిటీ ఫెయిర్ వారితో క‌లిసి చేసిన వీడియో.. వారి అధికారిక యూ ట్యూబ్ చానెల్లో సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. ఆస్కార్‌కి రెడీ అవుతోన్న RRR స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరుతో వీడియోను యూ ట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేయ‌గా దానికి 6.5 మిలియ‌న్స్ కంటే ఎక్కువ వ్యూస్ వ‌చ్చాయి.

ఆ చానెల్‌లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన వీడియో అదే కావ‌టం విశేషం. 'RRR సినిమాలోని నాటు నాటు పాట‌ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డ్ రావ‌టం అనేది రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న జీవితాల్లో ఎంతో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ని చెప్పొచ్చు. అలాంటి గొప్ప అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లే సంద‌ర్భంలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌నల‌పై ఈ వీడియోను చిత్రీక‌రించారు.
 
ఉపాస‌న‌కు ఆమె గ‌దిలో హెయిర్ స్ప్రేను స్ప్రే చేసే క్యూట్ మూమెంట్‌తో స్టార్ట్ అయ్యే ఈ వీడియో వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను కూడా తెలియ‌జేసేలా చేసింది. ఇది చాలా మందిని ఆక‌ట్టుకుంది. రామ్ చ‌ర‌ణ్ ఉన్న హోటల్‌ను ప‌రిశీలించిన‌ప్పుడు ఆయ‌న‌లోని భ‌క్తి కోణాన్ని తెలియ‌జేసింది. మ‌న సంస్కృతి సాంప్ర‌దాయాల‌పై ఆయ‌న‌కున్న బ‌ల‌మైన న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని ఇది తెలియ‌జేసేలా ఉంది. రామ్ చ‌ర‌ణ్ ఆస్కార్ వేడుక‌కి వెళ్లే స‌మ‌యంలో త‌యారైన విధానం చూస్తే ఆయ‌న‌లోని ఆక‌ర్ష‌ణ మ‌రింత గొప్ప‌గా, సున్నితంగా ప్ర‌స్పుట‌మైంది. దీంతో ఆయ‌న‌పై ఉన్న ఇష్టం మ‌రింత పెరిగింద‌న‌టంలో సందేహం లేదు. మ‌రో వైపు ఉపాస‌న చ‌క్క‌టి చీర‌క‌ట్టుతో క‌న‌ప‌డుతుంది. ఆమె హెయిర్ మేక‌ప్ చేసుకున్న తీరుని కూడా మ‌నం వీడియోలో చూశాం. వారిద్దరూ అలా రెడీయై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు రెడ్ కార్పెట్‌కు తాము సిద్ధ‌మ‌నే భావ‌న అంద‌రిలోనూ క‌లిగింది. చ‌రిత్ర‌ను సృష్టించే వేడుక‌కి బ‌య‌లుదేరేట‌ప్పుడు వారి గ‌దిలో ఏర్పాటు చేసుకున్న సీత రామ  ప్ర‌తిమ‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవ‌టాన్ని మ‌నం గ‌మ‌నించాం.
 
రామ్ చ‌ర‌ణ్‌కి ఉన్న ఆద‌ర‌ణ‌కి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలోని విశేషాల‌ను తెలుసుకుని ఆయ‌న అభిమానులు ఇంకెంత‌గా ఆక‌ర్షితుల‌య్యార‌నే దానికి ఈ వీడియోకి వ‌చ్చిన మిలియ‌న్ వ్యూస్‌ స్పంద‌న ఓ నిద‌ర్శ‌నం. అంతే కాకుండా ఇది ఆయ‌న‌కున్న స్టార్ ప‌వ‌ర్‌కి, చ‌రిష్మాకి ఎల్ల‌లు లేవ‌ని నిరూపించింది. ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండ‌స్ట్రీలో రామ్ చ‌ర‌ణ్ రికార్డుల‌ను చెరిపేస్తూ కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్నారు. చ‌ర‌ణ్‌లోని అంకిత భావం, స‌హ‌జ‌త్వం, మంచి లుక్స్ అన్ని క‌లిసి త‌న‌ని గొప్ప శ‌క్తిగా మార్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌ను ఆయ‌న ఆకర్షిస్తున్నారు. ఈ త‌రుణంలో మ‌న గ్లోబ‌ల్ సూప‌ర్ స్టార్ త‌ర్వాత ఏం చేస్తాడనేది తెలుసుకోవాలి అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రిన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల్సి ఉన్నాయి. అలాగే ఇంకా ప్రేక్ష‌కుల‌ను మ‌న‌స్సుల‌ను గెలుచుకోవాల్సి ఉంది. ఆయ‌న త‌న సతీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి భ‌విష్య‌త్తులో సాధించాల్సిన విజ‌యాలు ఎన్నో ఉన్నాయి.