సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (21:33 IST)

"పారిజాత పర్వం" నుంచి రంగ్ రంగ్ రంగిలా.. పాడింది ఎవరంటే?

Rang Rang Rangila
Rang Rang Rangila
సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన క్రైమ్ కామెడీ చిత్రం "పారిజాత పర్వం" ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్‌కి సానుకూల స్పందన లభించింది. 
 
ఇంకా రీమేక్ చేసిన లైవ్లీ క్లబ్ నంబర్ "రంగ్ రంగ్ రంగిలా" పాటను ఇటీవలే ఆవిష్కరించారు.  సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  "రంగ్ రంగ్ రంగిలా" పాటను శ్రద్ధా దాస్ పాడటం ఇంకో విశేషం.