సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (10:59 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సమంత సవాల్.. రష్మిక మందన థ్యాంక్స్

Rashmika Mandanna
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఊపందుకుంది. ఇందులో భాగంగా సెలెబ్రిటీలు మొక్కలు నాటుతూ ఇతరులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాటు.. వర్షాలు కూడా కురవడంతో మొక్కలు నాటే కార్యక్రమం మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఈ ఛాలెంజ్‌లో ఇప్పటికే చాలా మంది సెలెబ్రీటీలు పాల్గొన్నారు. 
 
తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన మామ నాగార్జునతో కలిసి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత మరో టాప్ హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్ విసిరింది. దీంతో ఈ ఛాలెంజ్‌లో భాగంగా రష్మిక మందన తాజాగా సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది. అంతేకాదు ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ అభిమానులతో షేర్ చేసుకుంది.
 
ఈ సందర్భంగా మరో ఇద్దరు రాశిఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్‌కు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరింది. తను గ్రీన్‌ ఛాలెంజ్‌ లాంటి గొప్ప కార్యక్రమంలోకి ఆహ్వానించిన అక్కినేని సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే  తన అభిమానులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.