సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (20:51 IST)

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? (video)

ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. పల్లెల్లో ఆడవారు అందరు ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్లయినవారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది.
 
ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి, అంటు రోగాలు వ్యాపించడం పరిపాటీ. ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతవరణం చల్లబడుతుంది. కాని ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బైట వాతవరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
 
గోరింటాకుకు శరీరంలోని వేడి తగ్గించే గుణం, రోగ నిరోధిక శక్తిని పెంచి, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఈ మాసంలో తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. నిజానికి గోరింటాకును లోగడ మగవాళ్ళ కూడా పెట్టుకునే వారు.
 
ఆడవారు గోరంటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జంట్స్, సర్ఫులను వాడటం వలన గోళ్ళలో నీరు చేరుతుంది. గోరంటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించ వచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తయిదవతనంతో వర్థిల్లుతారని విశ్వాసం.