ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (14:45 IST)

రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్టర్

Rashmika Mandanna
Rashmika Mandanna
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి  జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. 
 
ఇవాళ రశ్మిక మందన్న బర్త్ డే సందర్భంగా "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రశ్మిక సింపుల్ మేకోవర్ లో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. "ది గర్ల్ ఫ్రెండ్" లో ఆమె కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఇప్పటికి 60 శాతం షూటింగ్ పూర్తయింది. 
నటీనటులు - రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు