బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (18:08 IST)

జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ వీక్ టాప్ 10 బ్రాండ్స్ లో రశ్మిక మందన్న

Japanese fashion brand  - Rashmika
Japanese fashion brand - Rashmika
స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ లిస్టును తయారు చేసింది. ఫ్యాషన్ బ్రాండ్ విలువను డాలర్స్ తో చూసినప్పుడు రశ్మిక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒనిట్సుక టైగర్ బ్రాండ్ టాప్ 10లో 9వ స్థానంలో నిలిచింది.
 
ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ప్రకారం ఒనిట్సుక టైగర్ ఫ్యాషన్ బ్రాండ్ 75 లక్షల డాలర్ల వర్త్ కలిగి ఉంది. గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఇటలీలోని మిలాన్ లో జరిగిన ఫ్యాషన్ వీక్ లో రశ్మిక మందన్న ర్యాంప్ పై నడిచింది. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొని ఒనిట్సుక టైగర్ బ్రాండ్ ను రశ్మిక ప్రమోట్ చేసింది. పుష్ప , యానిమల్ మూవీస్ తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకుంది రశ్మిక మందన్న. ఈ క్రమంలోనే ఆమెకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేసే ఆఫర్స్ దక్కుతున్నాయి. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు మరింత ప్రచారం కల్పిస్తోంది రశ్మిక మందన్న.