శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:23 IST)

'బాహుబలి' సరికొత్త రికార్డు.. తెలంగాణలో రూ.50 కోట్లు

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో హీరో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'బాహుబలి.. కనక్లూజన్'. ఈ చిత్రం తెలంగాణ (నైజాం) పంపిణీ హక్కుల

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో హీరో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'బాహుబలి.. కనక్లూజన్'. ఈ చిత్రం తెలంగాణ (నైజాం) పంపిణీ హక్కులను ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌ దక్కించుకున్నారు. 
 
‘బాహుబలి: ద బిగినింగ్‌’ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ కావడమే కాకుండా, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడంతో సీక్వెల్‌కు బిజినెస్‌ వర్గాల్లో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ పోటీలో ఏకంగా రూ. 50 కోట్ల ఫ్యాన్సీ ధరకు ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌ తెలంగాణ హక్కుల్ని పొందడం పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. 
 
దీనిపై నారాయణదాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ 'గతంలో మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని తెలంగాణాలో పంపిణీ చేశాం. తాజాగా 'బాహుబలి' సీక్వెల్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నాం. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తప్పకుండా ఈ సినిమా ఘన విజయం సాధించి, మా సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.