బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (14:47 IST)

రేణుదేశాయ్ మాస్క్ అదుర్స్...

Renu Desai
పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ గత కొద్దిరోజులుగా ఆమె సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. 
 
సోషల్ మీడియా చిన్న గ్యాప్ ఇచ్చిన రేణు దేశాయ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. నెలన్నర తర్వాత మొదటి ఫోటో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. తన కూతురు ఆద్యతో ఉత్తేజ్ కూతురు పాటతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు రేణుదేశాయ్. 
 
ఇటీవల దర్శకురాలిగా మారి ఓ సినిమాను కూడా ప్రారంభించారు ఈ హీరోయిన్. సినిమాలతోనే కాదు పలు టీవీ షోలకు జెడ్జ్‌గా కూడా వ్యవహరించారు ఈ క్రేజీ హీరోయిన్. గత నెలన్నర రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్ నెలన్నర తర్వాత మొదటి ఫోటో పోస్ట్ చేశారు.