గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 27 ఫిబ్రవరి 2025 (09:25 IST)

Prabhudeva: ప్రభుదేవా కంటిన్యుటీ కొడుకు రిషి రాఘవేంద్ర వచ్చేస్తున్నాడు

Prabhu Deva, Rishi Raghavendra
Prabhu Deva, Rishi Raghavendra
సినిమా రంగంలో ప్రభుదేవా పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలపాటు డ్యాన్స్ చరిత్రలో ఓ పేజీ ఉండేలా చేసుకున్న ఆయన ఆమధ్య కొన్ని వివాదాలకు వేదిక అయ్యారు. నటుడిగా, దర్శకుడుగా, కొరియోగ్రాఫర్ గా ప్రజ్ఞను చాటుకున్న ఆయన తాజాగా తన వారసుడిని వెలుగులోకి తెచ్చారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రభుదేవా, కొడుకు రిషి రాఘవేంద్రను అందరికి పరిచయం చేసి కలిసి డాన్స్ చేయడం విశేషం.
 
కాగా, తండ్రి కొడుకులు ఒకేలా ఉండటం, కవలలు గా కనిపించారు. కొడుకును పరిచయం చేస్తూ అప్యాయంగా ముద్దుపెట్టుకున్నారు. ప్రభుదేవా డ్యాన్స్ చేస్తే స్ప్రింగ్ లా ఉండేది. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా ఇండస్ట్రీ లో పేరుతెచ్చుకున్నారు. ఇప్పడు రిషి కూడా అలానే ఉన్నాడు. వారస్త్యంగా వస్తున్న డాన్సర్ లో ప్రభుదేవా ఒకరు. తన కొడుకుతో ఉన్న ఫోటోలను ప్రభుదేవా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అంతే కాకుండా 'కంటిన్యుటీ' అంటూ ఈ ఫొటోకు ఒక్క మాటలో క్యాప్షన్ ఇచ్చారు.