సంబంధిత వార్తలు
- Bigg Boss Telugu 9- బిగ్ బాస్ తెలుగు 9 : ఈ వారం ఎలిమినేషన్ వుండదా?
- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?
- ప్రేక్షకులను ఆకర్షించేందుకు హద్దులు దాటేస్తున్నారు.. నియంత్రణ ఉండాల్సిందే.. కంగనా రనౌత్
- రేణూ దేశాయ్‌కి సోషల్ మీడియాలో వేధింపులు: ఇద్దరు అరెస్ట్
- విడుదలకు ముందే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
ఓ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా.. చివరకు హార్ట్ బ్రేక్ మిగిలింది : రీతూ చౌదరి
బుల్లితెర నటి, బిగ్ బాగ్ ఫేమ్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. ఓ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, కానీ హార్ట్ బ్రేక్ మిగిలిందని ఆమె వాపోయారు. తాజాగా తన వ్యక్తిగత జీవితం, ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలను ఉద్దేశిస్తూ ఆమె ఓ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇది చిత్రపరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తన రిలేషన్ బ్రేక్ కావడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. సమాజం అమ్మాయిలను చాలా సులభంగా జడ్జ్ చేస్తుందని, కానీ, వారు అనుభవించే బాధను ఎవరూ అర్థం చేసుకోరని పేర్కొంది. తాను ఒక వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని, కానీ చివరకు హార్ట్ బ్రేక్ మిగిలిందని ఎమోషనల్ అయింది. ఒకపుడు తన ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే తన అనుకున్న వ్యక్తి రిలేషన్‌లోకి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రేమలో ఓడిపోవడం వల్ల తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్లానని, కానీ, కెరీర్ కోసం ముఖంపై చిరు నవ్వులు చిందిస్తూ నటిస్తూ ముందుకు సాగుతున్నానని వాపోయింది. తనను నెగిటివ్‌గా చూపిస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు తనను మరింతగా కలిచివేస్తున్నాయని, నిశ్శబ్దాన్నే తన బలంగా మార్చుకున్నానని రీతూ చౌదరి పేర్కొంది.
