మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (13:33 IST)

బాలీవుడ్‌లో "ఆర్ఆర్ఆర్" సరికొత్త రికార్డు - రూ.200 కోట్ల కలెక్షన్లు

rrr movie
దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లు నటించగా మార్చి 25వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇది సరికొత్త వసూళ్ల రికార్డులను సృష్టిస్తుంది. 
 
ఈ సినిమా హిందీ వెర్షన్ మొదటి రోజు నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. సాధారణంగా హిందీలో రూ.100 కోట్ల మార్కును టచ్ చేయడమే గొప్పగా భావిస్తుంటారు. అలాంటి "ఆర్ఆర్ఆర్" చిత్రం ఏకంగా రూ.200 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. 
 
దీంతో బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఆశ్చర్యపడేలా చేసింది లాంగ్ రన్‌లో రూ.300 కోట్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు బాలీవుడ్ దర్శకనిర్మాతల, హీరోల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. కానీ, విడుదలైన తర్వాత కలెక్షన్లపరంగా దూసుకెళుతోంది. బాలీవుడ్ నటి అలియా భట్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ను నటించడం హిందీలో ప్లస్ అయింది. మరోవైపు, ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఆ చిత్ర కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పడం ఇపుడు ఈ చిత్రంపై మరింత ఆసక్తని పెంచుతుంది.