గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 ఏప్రియల్ 2022 (14:42 IST)

మహాభారతంపై దృష్టి పెట్టిన జక్కన్న.. ఐదు భాగాలు.. ఐదు సంవత్సరాలు?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహాభారతంపై దృష్టి పెట్టాడు. ఈ సినిమాని ఐదు భాగాలుగా తీయాలన్నది రాజమౌళి ఆలోచన. ఈ సినిమా కనీసం ప్రారంభమయ్యేందుకు ఐదేళ్లు పడుతుంది. ఇంతలోపు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు మొదలెట్టేశారు. రాజమౌళి సినిమాలన్నింటికీ.. విజయేంద్రప్రసాదే కథ అందిస్తుంటారు.
 
మహాభారతంలోని కీలకమైన ఘట్టాలన్నింటికీ గుదిగుచ్చి 5 భాగాలుగా చేయబోతున్నాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. ఒక్కో భాగంలో 3 నుంచి 4 పర్వాలు కవర్ చేసుకుంటూ వెళ్లాలి. ప్రతీ భాగంలోనూ ముగింపు పర్‌ఫెక్ట్‌గా కుదరాలి. అవన్నీ పక్కాగా కుదుర్చుకున్నాక మహాభారతం పనులు ప్రారంభమవుతాయి. 
 
ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి సంబంధించిన కథ రాయాల్సివుంది. అయితే. ఆ స్క్రిప్టులో కూర్చోవడానికి రాజమౌళి కొంత సమయం అడిగారని తెలిసింది. ఈలోగా "మహాభారతం" వర్క్‌ని విజయేంద్ర ప్రసాద్ మొదలెట్టారు.