గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (16:35 IST)

పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు ఇదే

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సరికొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. "జనగణమన" (జేజీఎం) అనే టైటిల్‌తో ఈ సినిమా ఓపెనింగ్ మంగళవారం ప్రారంభమైంది. పూరీ కనెక్స్ట్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబైలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్‌లో రాగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉ్న ఆర్మీ కమాండ్ వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. 
 
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, తదితరులు పాల్గొన్నారు. నిజానికి 'జనగణమన' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని భావించారు. కానీ, అది సాధ్యపడకపోవడంతో ఇపుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. వచ్చే యేడాది ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.