గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (22:58 IST)

ఈ ఏడాది విజయ్ దేవరకొండ - రష్మిక వివాహం చేసుకోబోతున్నారా? (video)

ఈ ఏడాది విజయ్ దేవరకొండ - రష్మిక వివాహం చేసుకోబోతున్నారా? అనేది చర్చనీయాంశమైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన సినిమాల్లో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పటి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు చుట్టుముట్టాయి.
 
టాలీవుడ్ అగ్ర తారలైన వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. పాన్ ఇండియా మూవీస్ స్టేజికి ఎదిగిన వీరిద్దరూ ప్రస్తుతం పెళ్లి చేసుకునే యోచనలో వున్నట్లు తెలిసింది. వారిద్దరూ తాము సంబంధంలో ఉన్నామని వచ్చిన వార్తలను ఎన్నడూ ఖండించలేదు లేదా ధృవీకరించలేదు. తాజాగా ఈ ఏడాది వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇందుకు కారణం లేకపోలేదు. ఈ  ఏడాది కొత్త సంవత్సరం గోవాలో దేవరకొండ సోదరులతో రష్మిక గడిపింది. పుష్ప నటి విజయ్ తల్లి మాధవితో గొప్ప సంబంధాన్ని పంచుకుంటోదని చెబుతారు.
 
ప్రస్తుతం విజయ్ తన బాలీవుడ్ సినిమా లైగర్ కోసం ముంబై షూటింగ్‌లో వున్నాడు. ఇక రష్మిక కూడా ముంబైలోని ఒక అపార్ట్ మెంట్‌లోకి మారినట్లు సమాచారం. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్నుతో ఈ నటి తన బి-టౌన్ అరంగేట్రం కోసం సిద్ధమవుతోంది.
 
పుష్ప: ది రైజ్ భారీ విజయం తరువాత రష్మిక బాగా పాపులరైంది. ఇందులో ఆమె అల్లు అర్జున్ సరసన జతకట్టింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ప్రేమ- వివాహం గురించి నోరు విప్పింది.
 
23 ఏళ్ల ఈ నటి ప్రస్తుతం వివాహానికి  తనకు వయస్సు సరిపోదంటూ తెలిపింది. "దాని గురించి ఏమి ఆలోచించాలో నాకు తెలియదు, నేను దాని గురించి ఆలోచించలేదు" అంటూ వెల్లడించింది.