గురువారం, 14 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2025 (11:46 IST)

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు దుస్తులు విప్పి ఎస్సై అసభ్యకర వీడియో కాలింగ్

victim
ధర్మవరం నియోజకవర్గంలోని పట్నం పోలీసు స్టేషనులో పనిచేస్తున్న ఓ ఎస్సై ఓ మహిళను అసభ్యకరమైన వీడియో కాల్ చేస్తూ వివాదంలో చిక్కుకున్నాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ ఫోన్ నెంబరు తీసుకుని ఆమెకి వీడియో కాల్ చేసి దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు అతడిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
 
రెండు నెలల క్రితం బంధువులకి సంబంధించిన ఓ వివాదం గురించి బాధిత మహిళ పోలీసు స్టేషనుకు వెళ్లింది. అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న సదరు అధికారి మహిళ ఫోన్ నెంబరు తీసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఆమెకి ఫోన్ కాల్స్ చేస్తూ అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తన దుస్తులు విప్పి చూపించి సదరు మహిళను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఇది గమనించిన బాధితురాలు భర్త, ఎస్సైను హెచ్చరించాడు.
 
ఐనా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీమళ్లీ మహిళకు వీడియో కాల్ చేస్తూ కామాంధుడి రూపాన్ని చూపెట్టడం ప్రారంభించాడు. దీనితో బాధిత మహిళ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.