గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (20:03 IST)

జక్కన్నపై అలిగిన అలియా భట్.. అందుకే అన్ ఫాలో చేసిందా?

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ జక్కన్నపై అలిగిందని తెలుస్తోంది. "ఆర్ఆర్అర్" సినిమాతో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా కనిపించిన ఆలియాకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకకపోయినప్పటికీ తన నటనతో బాగానే మెప్పించింది. 
 
నిజానికి ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోయిన్లు ఆలియా భట్, ఒలివియా మోరిస్ మరియు శ్రియ శరణ్ లలో ఆలియా కే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని అందరూ అనుకున్నారు.
 
కానీ మిగతా ఇద్దరు పాత్రలకి ఉన్న ప్రాధాన్యత కూడా లేకపోవడంతో అభిమానులు అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలో అలియా భట్ కూడా తన పాత్ర నిడివి విషయంలో నిరాశ చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో కూడా ఆలియా భట్ ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. దానికి సంబంధించిన పోస్ట్ లు కూడా పెట్టలేదు.
 
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో రాజమౌళిని అన్ ఫాలో చేసిందంటూ కొన్ని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. గతంలో "ఆర్ఆర్అర్" సినిమా గురించి చేసిన పోస్టులు కూడా కొన్ని డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది.