గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (10:41 IST)

ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన సీతక్క.. రివ్యూ ఏం ఇచ్చారంటే?

ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో పిరియాడిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. 
 
ఈ సినిమాపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క స్పందించింది. ఆదివారం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన తర్వాత… మూవీపై రివ్యూ ఇచ్చింది. 
 
దేశాన్ని విభజించేందుకు కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూడాలని.. అదే దేశం బాగు, సమైక్యత కోసం.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌‌లోని ఎన్టీఆర్‌ సీన్‌ను ట్యాగ్‌ చేసింది సీతక్క. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌‌గా మారింది.