శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఆర్. సందీప్
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (17:45 IST)

ఆర్ఆర్ఆర్ ఎప్పుడు విడుదలవుతుంది?

లాక్‌డౌన్ కారణంగా దాదాపు అన్ని పరిశ్రమలు ప్రభావితం అయిన సంగతి తెలిసిందే, సినీ పరిశ్రమ గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సినీ అభిమానులు రాక కోసం నిరీక్షిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయాలని అసలు ప్లాన్.
 
కానీ కరోనా వల్ల అది సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో, కథలో స్వల్ప మార్పులు చేయాలని, దానికి సంబంధించి చిత్ర బృందంతో చర్చలు జరపాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. అయితే జక్కన్న మాత్రం సినిమాని సరైన సమయానికి రిలీజ్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. స్క్రిప్ట్‌తో సహా భారీ యాక్షన్ సీక్వెన్స్, అవుట్ డోర్ షెడ్యూల్ సీన్స్‌‌లో ప్రధానంగా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
 
సాధ్యమైనంత వరకు తక్కువ సిబ్బందితో హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా షూటింగ్ పూర్తిచేయాలనుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా సినిమా చిత్రీకరణ పూర్తికావడంతో పెద్దగా ఇబ్బందులు ఏవీ ఎదురవవని భావిస్తున్నారు. తాజాగా సినిమా చిత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలో దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలకానున్నాయి.