సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 25 మే 2020 (15:14 IST)

లవ్ స్టోరీ నిర్మాత తోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ, ఇంతకీ ఎవరితో..?

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవిలతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి సినిమాను కూడా లాక్ చేసేశాడు. అది కూడా ‘‘లవ్ స్టోరీ’’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారు.
 
సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్ డౌన్ బ్రేక్‌లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటున్నారు. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్‌ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
 
ఈ కరోనా క్రైసిస్‌లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డిసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనం అని చెప్పుకోవాలి. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పైన నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు. ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేస్తారు.