సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 మే 2020 (22:11 IST)

హీరోయిన్ అంగీకరిస్తేనే క్యాస్టింగ్ కౌచ్.. : నందనీ రాయ్

చలనచిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. సినీ అవకాశాల పేరుతో లైంగిక కోర్కెలు తీర్చుకోవడం అనేదే క్యాస్టింగ్ కౌచ్. అనేక మంది హీరోయిన్లు ఈ వలలో చిక్కుకుని మోసపోయామని వాపోయారు. ఈ అంశంపై మీటూ పేరుతో ఓ ఉద్యమమే సాగింది. ప్రస్తుతం ఇది చప్పబడిపోయింది. కానీ, హీరోయిన్లు మాత్రం ఈ అంశంపై తమతమ అభిప్రాయాలను అపుడపుడూ వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా హీరోయిన్ నందనీ రాయ్ క్యాస్టింగ్ కౌచ్ అంశంపై తన మనసులోని మాటను వెల్లడించారు. 
 
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక అమ్మాయి లేదా హీరోయిన్ నిర్ణయంపైనే ఆధారపడివుంటుందన్నారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలు అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ వలలో చిక్కుకుంటున్నారు. అయితే, ఇక్కడ తుది నిర్ణయం మాత్రం అమ్మాయిదేనని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ వల విసిరితే అమ్మాయి లేదా హీరోయిన్ నో చెబితే ఎవ్వరేం చేయలేరన్నారు. అంటే.. అమ్మాయి లేదా హీరోయిన్ చెప్పే సమాధానంపైనే ఇది ఆధారపడివుంటుందని నందినీ రాయ్ చెప్పుకొచ్చింది. 
 
పైగా, క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఒక్క సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదన్నారు. వైద్య సీట్ల కోసం, పోలీస్ ఉద్యోగాల కోసం, ఐటీ కంపెనీలలో ఇలా అన్ని చోట్లా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చింది. అంతేందుకు నాకు తెలిసిన ఐటీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్లు చెప్పే కొన్ని విషయాలు విన్నప్పుడు సినిమా ఇండస్ట్రీనే చాలా బెటర్ అనిపించింది. సో.. నేను చెప్పేది ఏమిటంటే ఏదైనా ఈ విషయంలో అమ్మాయి తీసుకునే నిర్ణయంపైనే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఆధారపడి ఉంటుందనేది తన అభిప్రాయమన్నారు.
 
కాగా, నందనీ రాయ్ 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్', 'మాయ' వంటి చిత్రాల్లో నటించింది. అయితే, బిగ్ బాస్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యారు. ప్రస్తుతం లాక్డౌన్ వేళ ఇంట్లో ఉంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తోంది. 
 
'సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సహజం. ఏ రంగంలో అయినా.. అమ్మాయిలు ఇచ్చే సమాధానం మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయి లేదా హీరోయిన్ ఎవరైనా సరే.. కాదు అని చెబితే ఎవరూ ఏం చేయలేరు. 
 
ఈ విషయంలో ఎవరూ ఎవరినీ ఫోర్స్ చేయరు. నా కెప్పుడూ ఇలాంటివి అనుభవాలు ఎదురవ్వలేదు కానీ దీనికి సంబంధించి చాలా దగ్గరగా ఎన్నో సంఘటనలను చూశాను. అయితే కేవలం హీరోయిన్ల పేరే దీనికి వినిపించడం ఒకింత బాధగా ఉంటుందన్నారు.