శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (15:49 IST)

సమంత గురించి తిక్క హీరో అలా అనేశాడేంటి? ఏ మాయ చేసావె నుంచే ప్రేమిస్తున్నాడట!

సమంతను ప్రేమిస్తున్నానని.. ఏ మాయ చేశావే సినిమా నుంచే సమంత అంటే తనకు చాలా ఇష్టమని.. ఎవరైనా తనకు జోడీగా సమంతను ఒప్పిస్తే.. తప్పకుండా ఆమెతో కలిసి నటిస్తానని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. సమంత డేట్స్ అడ్జెస్ట్

సమంతను ప్రేమిస్తున్నానని.. ఏ మాయ చేశావే సినిమా నుంచే సమంత అంటే తనకు చాలా ఇష్టమని.. ఎవరైనా తనకు జోడీగా సమంతను ఒప్పిస్తే.. తప్పకుండా ఆమెతో కలిసి నటిస్తానని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. సమంత డేట్స్ అడ్జెస్ట్ చేసి తనతో నటిస్తే మాత్రం ఆ రోజు పండగ చేసుకుంటానని సాయి ధరమ్ తేజ్ అన్నాడు. అయితే అక్కినేని ఫ్యామిలీకి కోడలు కానున్న సమంత గురించి మెగా ఫ్యామిలీకి చెందిన తిక్క హీరో సాయి ధరమ్ ఇలా మాట్లాడటం అవసరమా అంటూ సినీ జనం అభిప్రాయపడుతున్నారు. 
 
ప్రస్తుతం నాగచైతన్య సమంత ప్రేమ-పెళ్లిపై టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగుతున్న తరుణంలో సాయిధరమ్‌ సమంతపై తనకు గల ప్రేమను ఓ ఇంటర్వ్యూలో ఇలా వ్యక్తపరచడంపై అక్కినేని కింగ్ నాగార్జున అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమంతకు వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. చైతూతో పెళ్ళి విషయంపై త్వరలో ప్రకటన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.