మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:51 IST)

వరంగల్ బస్టాండ్‌లో ఒంటరిగా సాయిపల్లవి.. ఏమైంది..?

సహజనటి సాయిపల్లవి వరంగల్లో ప్రత్యక్షమైంది. అదీ కూడా ఒంటరిగా కూర్చుని కనిపించింది. సాధారణ ప్రయాణీకురాలిగా అందరితో కలిసిపోయింది. పది నిమిషాల పాటు బస్టాండ్లో కూర్చునే ఉంది. ఎవరూ ఆమెను గమనించలేదు. అయితే ఆమె మాత్రం పది నిమిషాల పాటు బస్టాండ్లోనే కూర్చుండి పోయింది.
 
అసలు ఎందుకు సాయిపల్లవి వరంగల్ బస్టాండ్లో కూర్చుందో ఆ తరువాత గానీ అక్కడున్న వారికి అర్థం కాలేదు. విరాట పర్వం షూటింగ్‌లో భాగంగా సాయిపల్లవి అక్కడ కూర్చుంది. కెమెరామెన్ కూడా రహస్యంగా విజువల్స్‌ను కెమెరా ద్వారా చిత్రీకరించారు. 
 
అయితే సాయిపల్లవి పైకి లేచి వెళ్ళేటప్పుడు మాత్రం కొంతమంది గుర్తుపట్టారు. సాయిపల్లవి అంటూ గట్టిగా అరిచారు. ఇంతలో చుట్టూ కూర్చున్న యూనిట్ సభ్యులు అభిమానులు ఆపేశారు. సాయిపల్లవి అక్కడి నుంచి లేచి కారు ఎక్కి వెళ్ళిపోయారు. 
 
తెలంగాణా యాసలో సాయిపల్లవి ఈ సినిమాలో కూడా నటిస్తోంది. ఇప్పటికే ఫిదా సినిమాతో తెలంగాణా యాసలో మాట్లాడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది సాయిపల్లవి. విరాట పర్వంలో రానా హీరో. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.