బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2024 (19:27 IST)

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

Salman Khan
Salman Khan
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్ హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్టార్ హోటల్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతోంది. ఖాన్ "వై ప్లస్" కేటగిరీ సెక్యూరిటీ ప్రొటెక్టీ కావడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
 
సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వ భద్రతతో పాటు అతని స్వంత భద్రత కూడా ఉంది. గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చిన ఖాన్‌కు తాజాగా బెదిరింపులు వచ్చినట్లు అధికారులు శుక్రవారం ముంబైలో తెలిపారు.
 
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు గురువారం రాత్రి బెదిరింపు సందేశం వచ్చింది. సందేశం పంపిన వ్యక్తి నటుడిని బెదిరించి, బిష్ణోయ్ గ్యాంగ్ తరపున మనిషినని పేర్కొంటూ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా, ఆ వ్యక్తి 'మై సికందర్ హూన్' పాట రచయితను కూడా బెదిరించాడని పోలీసులు తెలిపారు.
 
ట్రాఫిక్ అధికారుల ఫిర్యాదు మేరకు వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.'సికందర్'లో 'పుష్ప: ది రైజ్' స్టార్ రష్మిక మందన్నా కూడా ఉన్నారు.