బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (16:55 IST)

అమ్మకు ప్రేమతో.. బ్యాచిలర్‌ లైఫ్‌కి సల్మాన్ ఖాన్‌ స్వస్తి.. డిసెంబరులోపు వివాహం!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తల్లి ఆరోగ్యం బాగోలేదని.. అమ్మ కోసం సల్మాన్ ఖాన్ బ్యాచిలర్ లైఫ్‌కి స్వస్తి చెప్పనున్నాడని బాలీవుడ్ కోడైకూస్తోంది. దీంతో అభిమానులు చాలా రోజులుగా సల్మాన్‌ ఖాన్‌ను పెళ్ళి కొడుకుగా చూడాలనే ఎదురుచూపులు ఫలించనున్నాయని తెలిసింది.

తన కుమారుడు ఓ ఇంటివాడైతే చూడాలనుందని చెప్పడంతో అమ్మ కోసం ఈ ఏడాదిలోపే ప్రేయసి యులియా వాంటూర్‌ను పెళ్లాడనున్నట్లు బిటౌన్లో వార్తలొస్తున్నాయి. సల్మాన్‌కి యులియాతో ఇప్పటికే నిశ్చితార్ధం కూడా అయిపోయిందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అమ్మ కోరికను తీర్చాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరుతో సల్మాన్ ఖాన్‌కు ఐదు పదుల వయస్సులో అడుగెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన సల్మాన్ తల్లి మాటను బాధ్యతగా స్వీకరించి ఈ ఏడాదిలోపు పెళ్లి చేసుకోనున్నాడని సన్నిహితులు సైతం చెప్తున్నారు.