సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ashok
Last Updated : బుధవారం, 19 జులై 2017 (12:09 IST)

సైకిళ్లు పంచుతున్న బాలీవుడ్ కండలవీరుడు‌... 'శ్రీమంతుడు' స్ఫూర్తా?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన సామాజిక సేవా సంస్థ బీయింగ్ హ్యూమన్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్‌లో విడుదల చేశారు. తన ప్రియమిత్రుడు షారూఖ్ ఖాన్ పిల్లలకు ఈ సైకిళ్లను కానుకగా ఇచ్చి పిల్లల పట్ల తనకు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన సామాజిక సేవా సంస్థ బీయింగ్ హ్యూమన్ ద్వారా ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్‌లో విడుదల చేశారు. తన ప్రియమిత్రుడు షారూఖ్ ఖాన్ పిల్లలకు ఈ సైకిళ్లను కానుకగా ఇచ్చి పిల్లల పట్ల తనకు గల ప్రత్యేక అభిమానం గురించి మరోమారు చాటుకున్నాడు.
 
దీని గురించి షారూక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సల్మాన్ చాలా మంచి మనిమనిషి అని.... ఇటీవల మా ఇంట్లో జరిగిన ఒక గెట్‌టుగెదర్ పార్టీకి వచ్చిన సల్మాన్ తన పిల్లలకు ఈ కానుక ఇచ్చి పిల్లలను ఆనందాన్ని కలిగించాడని, ఆ కానుకలు మా పిల్లలకు చాలా నచ్చాయని చెప్పుకొచ్చాడు. 
 
అంతేకాకుండా, మొన్న విడుదలైన సల్మాన్ 'ట్యూబ్‌లైట్' చలనచిత్రంలో తను అతిథి పాత్ర పోషించినట్లుగానే, ఈసారి నేను నటించనున్న చిత్రంలో సల్మాన్ కనిపించి అభిమానులను అలరిస్తాడని తెలియజేశాడు.