బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (17:16 IST)

96 రీమేక్... సమంత ప్రక్కన శర్వానంద్ కన్ఫర్మ్

తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన చిత్రం 96. ఈ అంద‌ర్నీ ఆక‌ట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమాని చూసిన దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది కానీ... ఎప్పుడు స్టార్ట్ కానుంది... ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా... కాదా.. అనేది మాత్రం తెలియ‌లేదు. ఇక తాజా స‌మాచారం ఏంటంటే... తెలుగు రీమేక్‌లో సమంత, శర్వానంద్ జంటగా నటించబోతున్నారు. తమిళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ తెలుగు వెర్షన్‌నూ రూపొందించనున్నాడు. 
 
దిల్ రాజు నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 96 క‌థ విష‌యానికి వ‌స్తే... రాం, జానకి అనే ఇద్దరు చిన్ననాటి క్లాస్‌మేట్ల కథ. స్నేహం ప్రేమగా చిగురించాక తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోయిన ఆ ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకున్నాక ఏం జరిగిందనేది అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగపూరితంగా ప్రేం కుమార్ తెర‌కెక్కించాడు. 
 
వర్తమాన, భూత కాలాల్లో నడిచే ఈ సినిమా కథ ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తుందనే నమ్మకంతో దిల్ రాజు తెలుగులో రీమేక్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. మ‌రి.. తెలుగులో ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.