శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (16:26 IST)

విశాల్‌తో సినిమా ఓవర్.. పెళ్లైనా నో ఛేంజ్ : సమంత కామెంట్

రంగస్థలం, మహానటి సినిమాల్లో నటిస్తూనే సమంత అక్కినేని కోలీవుడ్‌లో విశాల్ సరసన ఇరుంబుతిరై సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సినీ యూనిట్ కేక్ కట్ చేసి పండగ చేసుకుంది. ఈ ప్రోగ్రా

రంగస్థలం, మహానటి సినిమాల్లో నటిస్తూనే సమంత అక్కినేని కోలీవుడ్‌లో విశాల్ సరసన ఇరుంబుతిరై సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సినీ యూనిట్ కేక్ కట్ చేసి పండగ చేసుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో సమంత హైలైట్‌గా నిలిచింది. సమంత ధరించిన బ్లాక్ డ్రెస్ ప్రత్యేక అందాన్నిచ్చింది. అక్కినేని నాగార్జున కోడలు అయిన సమంత.. చేతిలో వున్న సినిమాలన్నింటినీ పూర్తి చేస్తూ వస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో విశాల్ హీరోగా నటించిన ఇరుంబుతిరైలో సమంత హీరోయిన్‌గా నటించింది. మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తయ్యింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో అభిమన్యుడుగా విడుదల చేయనున్నారు. ఇందులో సమంతా డాక్టర్ రతీదేవిగా కనిపించనుందంటూ తాజాగా విడుదలైన పోస్టర్లో వెల్లడైంది.
 
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఇరుంబుతిరైలో విశాల్ నటన సూపర్ అంటూ కితాబిచ్చింది. పెళ్ళి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. అయితే పెళ్లికి ముందు తనను ఎలా ట్రీట్ చేశారో.. అదేవిధంగానే పెళ్లయ్యాక కూడా చూశారని తెలిపింది. తనకు పెళ్లైందని ఏదీ మారిపోలేదని సమంత చెప్పుకొచ్చింది.
 
2018 వచ్చేస్తోంది. మార్పు సంభవిస్తుందని.. విశాల్‌తో సినిమా తన ఖాతాలో హిట్ ఇస్తుందని సమంత ధీమా వ్యక్తం చేసింది. విశాల్ ఎనర్జిటిక్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడని.. జార్జ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా సంగీతం అదుర్స్ అంటూ సమంత కితాబిచ్చింది.