నాగచైతన్య సమంతతో కలిసి సినిమా చూశాడా? చైతూతో త్వరలో పెళ్ళా?
ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత దక్షిణాదిన అగ్ర హీరోయిన్‌గా ఎదిగిపోయినప్పటికీ, తన ఫస్ట్ ఫ్రెండ్.. ఫస్ట్ హీరో నాగచైతన్యతో స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఇటీవల సమంత తనతో పాటు సినిమాల్లో నటించిన హీరోనే పెళ్ళి చేసుకుంటానని కామెంట్ చేసి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ హీరో ఎవరబ్బా అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తుంటే.. ఆ హీరో నాగచైతన్య అంటూ కొందరు అంటున్నారు.
ఇందుకు కారణం కూడా లేకపోలేదని వారంటున్నారు. ఆ రూమర్ ని నిజం చేస్తూ ఇప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. సమంత హీరోయిన్‌గా విడుదలైన అ.ఆ.. సినిమాను నాగ చైతన్య, సమంతలు కలిసి చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోతో సమంత నాగచైతన్యనే పెళ్లాడనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.