మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (10:21 IST)

సమంతతో గోవాలో బర్త్ డే సెలెబ్రేషన్... నాగచైతన్యపై ఫ్యాన్స్ ఆగ్రహం..

నాగచైతన్య తొలిసారిగా తన పుట్టినరోజు వేడుకలను కాబోయే భార్య సమంతతో గోవాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నాజు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. చైతూకి పుట్టినరోజు నాడు విషెస్

నాగచైతన్య తొలిసారిగా తన పుట్టినరోజు వేడుకలను కాబోయే భార్య సమంతతో గోవాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నాజు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. చైతూకి పుట్టినరోజు నాడు విషెస్ చెప్పాలని బుధవారం ఉదయం అక్కినేని ఫ్యాన్స్ స్టూడియోకి కొంతమంది, హౌస్‌కి మరికొందరు వచ్చారట. చైతూ లేడని విషయం తెలియగానే కాసింత ఆగ్రహంతో వెనుదిరిగారు. 
 
పుట్టినరోజునాడు ఏఎన్ఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు అభిమానులకు అందుబాటులో వుండి ఫోటోసెషన్‌లో పాల్గొంటారని, చైతూ ఇలా చేయడం బాగాలేదంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అభిమానులతో ఫోటో సెషన్ తర్వాత వెళ్లొచ్చుకదా అని వారు వాపోయారట. అక్కినేని ఫ్యాన్స్ సీరియస్ కావడం ఇదే తొలిసారి. మరి అభిమానుల ఆగ్రహాన్ని చైతూ ఎలా కూల్ చేస్తాడో వేచి చూడాలి.