గురువారం, 6 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మార్చి 2025 (15:34 IST)

ప్రేమించడం లేదా అన్నది తన వ్యక్తిగతం : సమంత

Samantha
హీరోయిన్ సమంత ప్రేమలో పడినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె తాజాగా స్పందించారు. జీవితంలో మళ్లీ ప్రేమలో పడాలని ఎపుడూ ఆలోచించలేదని చెప్పింది. ప్రేమ గురించి చర్చించాలని కూడా తనకు లేదని తెలిపింది. ప్రేమ అనేది తన వ్యక్తిగత విషయమని, దాన్ని వ్యక్తిగతంగానే ఉంచుతానని తెలిపింది. సమంత చెప్పిన మాటలను చూస్తుంటే ఆమె మళ్లీ ప్రేమలోపడినట్టుగా తెలుస్తుంది. అదేసమయంలో తనకు మరోమారు ప్రేమించాలన్న ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. 
 
కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో ప్రేమలోపడిన సమంత.. అతన్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నాగ చైతన్య నటి శోభితను వివాహం చేసుకున్నాడు.
 
అదేసమయంలో సమంత మాత్రం అరుదైన వ్యాధి బారినపడి విదేశాల్లో చికిత్స తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిన ఆమె... తన సినీ కెరీర్‌పై పూర్తిగా దృష్టిసారించారు. ఈ పరిస్థితుల్లో ఆమె ప్రేమలో పడిందనే వార్తలు వస్తుండటంతో సమంత పైవిధంగా స్పందించారు.