సంబంధిత వార్తలు
- ఎలుగుబంటి ఎన్‌క్లోజర్ తెరిచేవుంది.. క్లీన్ చేస్తుంటే దాడి.. ఆపై?
- రణ్‌బీర్ కపూర్ తో గొప్ప అనుభూతి పొందాను : రష్మిక
- 'యానిమల్' ట్రైలర్ విడుదల .. అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌తో..?
- మాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ - రణ్‌బీర్ కపూర్ 'బెస్ట్ యాక్టర్ : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
- బన్నీ కోసం అర్జున్ రెడ్డి.. ప్రభాస్, మహేష్ యానిమల్కు నో చెప్పారా?
సినిమా ఫార్ములాను బ్రేక్ చేసిన దర్శకుడు సందీప్ వంగా : ఎస్ఎస్ రాజమౌళి
mahesh, Rajamouli with Animal team
మహేష్ బాబు మాట్లాడుతూ.. యానిమల్ కు మీరు ఇంతగా ఆదరణ చూపిస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ట్రైలర్ చూశా.. మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేను ఇప్పటివరకూ చూడలేదు. నేను ఎప్పుడూ ఇలా చెప్పను. మనస్పూర్తిగా ఫీలైతేనే చెబుతాను. సందీప్ ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించగానే రావాలనిపించింది. సందీప్ అంటే నాకు ఇష్టం. తను చాలా యునిక్, ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసిందని విన్నా. ఇది ప్రీ రీలిజ్ ఈవెంట్ లా లేదు. వందరోజుల వేడుకలా వుంది. ట్రైలర్‌లోని అనిల్ కపూర్ గారి నటన చూసిగూస్ బంప్స్ వచ్చాయి. బాబీ దేవోల్ యాక్టింగ్ స్టన్నింగ్ గా వుంది. రష్మిక అన్ని భాషల్లో నటిస్తోంది. ట్రైలర్ లో అద్భుతంగా వుంది. తన ప్రయాణం చూస్తుంటే చాలా గర్వంగా వుంది. రణ్‌బీర్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పా గానీ ఆయన సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఈ వేదికపై మరోసారి చెబుతున్నా. నేను తన అభిమానిని, రణ్‌బీర్ ఇండియాలో ది బెస్ట్ యాక్టర్ అని నా అభిప్రాయం. యానిమల్ ఇప్పటివరకూ తన బెస్ట్ వర్క్ అని నా భావన. ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డిసెంబర్ 1న యానిమల్ విడుదలౌతుంది. తప్పకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందరినీ ధన్యవాదాలు తెలిపారు.
స్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. మన ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ ఎలా వుంటుందో మనకి తెలుసు. కానీ ముంబై నుంచి ఎవరైనా వచ్చినపుడు మా ప్రేక్షకులు ఇలా వుంటారని చూపించాలని అనిపిస్తుంటుంది. ఇవాళ రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, భూషణ్ కుమార్ ఈ వేదికపై వున్నారు. వారికి మీ అందరినీ ప్రేమ, ఆదరణ చూపించడం చాలా ఆనందంగా వుంది. ప్రతి ఏడాది కొత్త దర్శకులు వస్తారు, పెద్ద సినిమాలు తీస్తారు, విజయాలు అందుకుంటారు, చాలా పేరు సాధిస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ప్రేక్షకులని ఇండస్ట్రీనే కాదు సినిమా ఫార్ములాని కూడా షేక్ చేసే దర్శకులు వస్తారు. వొకప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చారు. దాని తర్వాత ఈ ఫార్ములాని పక్కన పెట్టి సినిమా చేయగలనని నిరూపించిన దర్శకుడు సందీప్ వంగా. సందీప్ ని చూస్తుంటే చాలా గర్వంగా వుంది. యానిమల్ టీజర్ వచ్చిన వెంటనే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించింది. రణ్‌బీర్ కపూర్ ఇంటెన్స్ యాక్టర్. బాలీవుడ్ లో నా ఫేవరేట్ యాక్టర్ తను. తనలో చాలా ఇంటెన్సిటీ వుంటుంది. తన ప్రతిభ చూపించుకునే సినిమాలు చాలా తక్కువ పడ్డాయని నా అభిప్రాయం. యానిమల్ తో రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలోకి వెళ్తారని భావిస్తున్నాను. యానిమల్ కోసం టీం చాలా హార్డ్ వర్క్ చేసింది. చాలా అద్భుతంగా సినిమా వచ్చింది. డిసెంబర్ 1న అందరూ సినిమాని థియేటర్ లో చూడాలి అని కోరారు.
