శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (10:12 IST)

పవన్ కళ్యాణ్‌ను చూడగానే భావోద్వేగానికి లోనైన 'సప్తగిరి'

తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చూడగానే హీరో సప్తగిరి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ దృశ్యం సప్తగిరి ఆడియో విడుదల కార్యక్రంలో కనిపించింది. సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస

తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను చూడగానే హీరో సప్తగిరి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ దృశ్యం సప్తగిరి ఆడియో విడుదల కార్యక్రంలో కనిపించింది. సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. ఈ చిత్ర ఆడియో వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక సప్తగిరి ఎక్స్‌ప్రెస్ యూనిట్ అయితే పవన్ కళ్యాణ్‌ని ఆకాశానికి ఎత్తేసారు. పవన్ కళ్యాణ్ దేవుడని కొనియాడారు. పవన్ గురించి అంతగా పొగుడుతుంటే పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిలా విరగబడి నవ్వాడు. 
 
ఇక ఆ నవ్వు ఎంతగా ఉందంటే ఒక దశలో పవన్ కళ్యాణ్‌కు కూడా నవ్వి నవ్వి కన్నీళ్ళు వచ్చాయి. అంతేకాదు సప్తగిరి నటన అంటే చాలా ఇష్టమని అలాగే తప్పకుండా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ చిత్రాన్ని చూస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు.