హైదరాబాద్: గోకూప్ లైవ్లీహుడ్స్ ఫౌండేషన్, యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌తో కలిసి 2025 మార్చి 11న బంజారా హిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం పేరిట ఒక సమావేశం నిర్వహించింది. చేనేత రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి, ప్రపంచ మార్కెట్‌లో వారసత్వ కళలు వృద్ధి చెందేలా పరిష్కారాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం విధాన నిర్ణేతలు, ఆలోచనాపరులు, నేత కార్మికులు, నేత సంస్థలను ఒకచోట చేర్చింది.
తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్స్(ఐటిఇ &సి), పరిశ్రమలు & వాణిజ్య విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ సమావేశంలో కీలకోపన్యాసం చేసి, చేనేత రంగానికి స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో సాంకేతికత పాత్రపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ శ్రీ గారెత్ విన్ ఓవెన్; డిజిఎం నాబార్డ్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ శ్రీనివాస్; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ఎంఎస్ఎంఇ & సెర్ప్) డాక్టర్ ఎం శంకర ప్రసాద్; హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, ఎగ్జిమ్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ & రీజినల్ హెడ్ - ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ శ్రీమతి పూర్ణిమ బుసి; లీడ్ ఏంజెల్ ఇన్వెస్టర్, రచయిత్రి, మెంటర్ శ్రీ నాగరాజ ప్రకాశం వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ నిపుణులు, డిజైనర్లు, చేతివృత్తుల ప్రతినిధుల నుండి విశిష్ట వక్తలు కళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, అమ్మకాలను పెంచడానికి సాంకేతికత, ఇ-కామర్స్‌ను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత, ఆధునిక వినియోగదారులకు చేనేత ఉత్పత్తులను మరింత ఆకర్షణీయంగా మార్చడం, కీలకమైన వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం గురించి మాట్లాడారు. యాక్సెస్ డెవలప్‌మెంట్ సర్వీసెస్‌లోని నాన్ ఫార్మ్ VP సువేందు రౌట్ మాట్లాడుతూ, “నేత కార్మికులు, డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు, విధాన రూపకర్తల మధ్య అర్థవంతమైన చర్చలకు దారితీసింది. చేనేత రంగం వృద్ధికి దోహదపడాలని మేము కోరుకుంటున్నాము" అని అన్నారు.
గోకూప్ వ్యవస్థాపకులు శివ దేవిరెడ్డి మాట్లాడుతూ, "భారతదేశ కళాకారులు, నేత కార్మికులకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించడంను మేము ఎల్లప్పుడూ గోకూప్ వద్ద విశ్వసిస్తుంటాము. ఈ రంగం యొక్క ముఖ్య వాటాదారులను ఒకే తాటిపైకి తీసుకురావడం, సవాళ్లను గుర్తించడం, ముందుకు సాగే మార్గాలను చర్చించడం, భారతదేశ చేనేత వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి, చేనేత రంగానికి స్థిరమైన భవిష్యత్తును అందించడానికి ఒక ఉద్యమాన్ని సృష్టించడం ఈ సమావేశం ద్వారా లక్ష్యంగా చేసుకున్నాం" అని అన్నారు.
గోకూప్ మార్చి 12 నుండి 16, 2025 వరకు కళింగ కల్చరల్ హాల్‌లో గోస్వదేశీ ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా 45 మందికి పైగా కళాకారులను ఒకచోట చేర్చింది, ప్రామాణికమైన చేనేత ఉత్పత్తులను అన్వేషించడానికి, కొనుగోలు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.